హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శుక్రవారం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన తండ్రి వెంకట్రావు మరణించి శుక్రవారంనాటితో ఏడాది (తిథుల ప్రకారం) పూర్తయింది. దీంతో సంవత్సరీకం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చిరంజీవి తన తల్లి, సోదరులు, ఇతర బంధువులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు.