హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మెదక్ జిల్లా పర్యటన ఖరారైంది. "ప్రజా అంకిత సభ'ల పేరిట జిల్లాలో సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ మీడియాకు తెలిపారు. ఈనెల 18న పటాన్‌చెరువులో, సంగారెడ్డిలో, సదాశివపేట, జహీరాబాద్‌లలో సభలు జరుగనున్నట్లు వారు వివరించారు. అదే రోజు రాత్రి జహీరాబాద్‌లోనే చిరంజీవి బస చేస్తారు. 19న నారాయణఖేడ్‌లో, ఆందోల్‌లో, మెదక్, నర్సాపూర్‌లలో సభలను నిర్వహించి హైదరాబాద్ వెళ్తారని చెప్పారు. 20న గజ్వేల్‌లో, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేటలలో, తూప్రాన్ లో సభలు నిర్వహించి చిరంజీవి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.