ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహాల తరలింపు
వరంగల్: మామునూర్ వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన యాసిడ్ దాడి నిందితులు శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణల మృతదేహాలను సంగెం మండలం ఎమ్మార్వో నాగయ్య సంఘటన స్థలంలో శనివారం ఉదయం పంచనామా నిర్వహించారు.అనంతరం పోలీసులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నిందితులు ముగ్గురూ మృతి చెందిన విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు సంఘటనాస్థలానికి తరలివచ్చారు. మృతులను చూసి మంచి పని జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. తహశీల్దారు వచ్చి పంచనామా చేసిన అనంతరం మృతదేహాలను ఓ ట్రక్కులో వేసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.పోస్టుమర్టం అయిన తర్వాత మృత దేహలను కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అయితే మృతుల కుటింబీకులెవరూ ఆస్పత్రి వద్దకు రాలేదు.












Click it and Unblock the Notifications