హైదరాబాద్ : వరంగల్‌లో స్వప్నిక, ప్రణీతలపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం సరికాదని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా అన్నారు. దోషులను కఠినంగా శిక్షించేందుకు చట్టాలను సవరించుకోవాలే తప్ప, ఇలా ఎన్‌కౌంటర్‌కు పాల్పడడం తగదని ఆమె అన్నారు. వరంగల్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌పై రోజా వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ స్వప్నిక కేసు పెట్టినపుడే పోలీసులు స్పందించి ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదని అన్నారు. పోలీసులు పక్షపాత వైఖరికి పాల్పడకుండా చట్టాలను అనుసరించినపుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని రోజా అభిప్రాయపడ్డారు.