ఎన్ కౌంటర్ పై ఎస్పీ సమర్ధన
వరంగల్: శ్రీనివాస్, సంజయ్, హరికృష్ణలపై ఆత్మరక్షణకై కాల్పులు జరపవలసి వచ్చిందని వరంగల్ ఎస్.పి. సజ్జనార్ మీడియాతో అన్నారు. అలాగే వారు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్ దాడి చేశారని వరంగల్ ఎస్పీ సజ్జనార్ అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని, చట్టం తన పని తాను చేస్తుందని ఎస్పీ అన్నారు. తాము నిందితులు చెట్లలో దాచిపెట్టిన ఆయుధాలను రికవరీ చేసుకునేందుకే నిందితులతో కలిసి వెళ్లామని ఆయన అన్నారు. వారు తమపై దాడికి దిగినందునే ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారని ఆయన అన్నారు. వారికి తుపాకులు ఎక్కడినుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తామని అన్నారు.చట్టం తనపని చేసుకుపోతుంది. తప్పితే ఇది కావాలని చేసిందికాదని ఎస్.పి. సమర్ధించుకున్నారు. అలాగే విలేకరులు వేసిన పలు ప్రశ్నలకు సజ్జనార్ ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఈ కేసు ఇంతటితో ఆగిపోలేదు. ఇంకా విచారణలో ఉందంటూ దాటవేశారు.












Click it and Unblock the Notifications