స్వప్నిక ఆరోగ్యం విషమంగానే...

ఇక తమ పిల్లలపై అమానుషంగా దాడిచేసిన వారిపై యావత్తు రాష్ట్ర ప్రజానీకం ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని, వారికి తగిన శిక్ష పడాలని కోరుకున్నారని అంతా వారి కోరికమేరకే జరిగిందని యాసిడ్ దాడికి గురైన స్వప్నిక తల్లిదండ్రులు అన్నారు. వారికి తగిన శిక్ష పడిందని సంతోషిస్తున్నారా అని విలేకరులు అడగగా తమకు సంతోషం కాని బాధ కాని లేదని తమ బాధ అంతా తమ కూతురు గురించేనని, ఆమె చావుబతుకుల మధ్య ఉంటే తమకు వేరే ఆలోచనలు ఎలా వస్తాయని స్వప్నిక తల్లిదండ్రులు దేవేందర్, శ్రీలత అన్నారు. తమ పిల్లల కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications