సినిమాలతో చేయలేకే...: పవన్

Pawan Kalyan
హైదరాబాద్: సినిమాల ద్వారా సామాజిక సేవ సాధ్యం కాకనే తాను రాజకీయాల్లోకి వచ్చానని యువరాజ్యం అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. యువరాజ్యం సదస్సులో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా మనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నామని, దీనికి మనలో సున్నితత్వం చచ్చిపోవడమే కారణమని ఆయన అన్నారు. రాజకీయ నేతలు, వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు తమ చుట్టూ తామే గిరిగీసుకుని బతుకుతున్నారని అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదులు దాడులు చేస్తే బాధ పడి, కొవ్వొత్తులు వెలిగించి సానుభూతి ప్రకటిస్తే సరిపోదని భవిష్యత్తులో మళ్లీ జరక్కుండా ఉద్యమం చేయాలని ఆయన అన్నారు. సామాజిక న్యాయం రోజురోజుకు అంతరించిపోతోందని, దీన్ని చక్కదిద్దకపోతే అంతర్యుద్ధాలు వస్తాయని ఆయన అన్నారు. అమెరికాలో 52 ఏళ్ల క్రితం రోజాపార్క్స్‌ అనే నల్లజాతి మహిళ బస్సులో ముందు సీట్లోనే కూర్చుకుంటానని తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనమని, అదే ఇప్పుడు ఒబామాను దేశాధ్యక్షుడిగా ఎన్నుకొనేందుకు పునాది అయిందని ఉదహరించారు.

''స్వప్నిక తొలిసారి ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు, అధికారులు స్పందించి ఉంటే ఇప్పుడు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చేది కాదని, శ్రీలక్ష్మి, గంగాభవాని, స్వప్నిక.. ఇలా బాధితులు పెరిగేవారు కాదని, చనిపోవడం ఎలాగూ తప్పదని సమస్యలపై పోరాడి చనిపోతే గుర్తింపన్నా వస్తుందని, అందుకే అడవుల్లోకి వెళ్లడం కన్నా జనారణ్యంలో ఉండి పోరాడాలని అనుకున్నానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+