వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్గవి సహ మృతుడు బుజ్జి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ నటి భార్గవితో పాటు మరణించిన వ్యక్తి బుజ్జిది నెల్లూరు జిల్లా. అతను అర్కెస్ట్రా బృందాన్ని నడుపుతుంటాడు. అతను సాంస్కృతిక కార్యక్రమాలు ఇస్తుంటాడు. బుజ్జి అసలు పేరు ప్రవీణ్ కుమార్. ఏడాది క్రితం భార్గవితో అతనికి వివాహమైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వారిద్దరికి పెళ్లి కాలేదని, వారిద్దరి మధ్య పెళ్లి ప్రతిపాదనలు కూడా లేవని భార్గవి తండ్రి ప్రసాదరావు అంటున్నారు. బుజ్జికి స్వస్థలం నెల్లూరులో మంచి పేరుంది.

టీవీలో నటిస్తున్న సమయంలో భార్గవికి, బుజ్జికి మధ్య పరిచయం ఏర్పడినట్లు, అది పెళ్లికి దారి తీసినట్లు చెబుతున్నారు. మొన్న బుజ్జి నెల్లూరులో ఆర్కెస్ట్రా కార్యక్రమం ఇచ్చి సోమవారం రాత్రి హైదరాబాదు వచ్చినట్లు చెబుతున్నారు. బుజ్జికి భార్గవితో మూడో వివాహమని చెబుతున్నారు. బుజ్జి మొదట డాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు, ఆమెతో విడిపోయి ఆ తర్వాత స్వప్నను పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. స్వప్న కూడా సినీ నటి. ఆమెతో విడిపోయి భార్గవిని బుజ్జి పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, బుజ్జికి తన కుటుంబ సభ్యులతో పెద్దగా సంబంధాలు లేవని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X