హైదరాబాద్ : తెదేపా అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనల్ని ఆ పార్టీ ఖరారు చేసింది. ఈనెల 26 నుంచి రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో బాబు పర్యటించనున్నారు. ప్రతి జిల్లాలో పర్యటించి, ప్రతి రెవెన్యూ మండలంలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలను, అవినీతిని ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పడమే లక్ష్యంగా ఆయన జిల్లా యాత్రలు జరుగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.