ముంబై దాడికి హైదరాబాద్ లింక్
ముంబై: ముంబై ఉగ్రవాద దాడులకు హైదరాబాదుకు లంకె ఉంది. పోలీసులకు చిక్కిన ముంబై దాడుల టెర్రరిస్టు అజ్మల్ కసబ్ వద్ద హైదరాబాదులోని కాలేజీకి చెందిన ఐడెంటిటీ కార్డు లభించడం ఆ అనుమానాలకు తావిస్తోంది. అజ్మల్‌తోపాటు మరణించిన ఉగ్రవాదుల్లో కొందరి వద్ద హైదరాబాద్ చిరునామాలతో బోగస్ గుర్తింపు కార్డులు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ వద్ద కాల్పులు జరిపిన అజ్మల్, ఇస్మాయిల్‌ల వద్ద పోలీసులు రెండు బోగస్ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
కసబ్ వద్ద లభించిన కార్డు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని అరుణోదయ పీజీ కళాశాల పేరుతో ఉంది. అందులో అతడి ఫొటో ఉంది. పేరు నరేష్‌వర్మ అని ఉంది. నాగోల్, హైదరాబాద్ నివాసిగా అతని చిరునామా ఉంది. ఇక ఇస్మాయిల్ వద్ద లభించిన బోగస్ కార్డులో అతడి పేరు సమీర్ చౌదరిగాను, చిరునామా టీచర్స్ కాలనీ, బెంగళూరుగాను ఉంది. మరణించిన మిగతా ఉగ్రవాదుల వద్ద కూడా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులకు చెందిన పలు కళాశాలల బోగస్ గుర్తింపు కార్డులున్నట్లు తెలుస్తోంది. కసబ్ వద్ద తమ కాలేజీకి చెందిన ఐడెంటిటీ కార్డు ఉండడం పట్ల అరుణోదయ కళాశాల యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications