విశాఖ బీచ్ లో ప్రేమజంట మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం సముద్ర తీరంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిద్దరిని భారతి, మల్లీశ్వరరావులుగా గుర్తించారు. వీరిద్దరిది గాజువాక అని తెలుస్తోంది. వీరిద్దరు మణికట్టును కోసుకుని, ఆ తర్వాత మెడపై కోసుకుని సముద్రంలోకి దూకారు. భారతి శవం తీరానికి కొట్టుకురాగా, మల్లీశ్వరరావు శవం సముద్రంలోకి దూకారు. వీరిది ఆత్మహత్యానా కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరు ఒకరినొకరు పొడుచుకుని ఉంటారా అనే సందేహం కూడా కలుగుతోంది. మల్లీశ్వరరావు శవం కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.
వీరిద్దరు ఆర్గానికి కెమిస్ట్రీలో పిహెచ్ డి చేస్తున్నారు. సముద్ర తీరంలో వారి పుస్తకాలు పడి ఉన్నాయి. భారతి శవమైపై కత్తి గాట్లు ఉన్నాయి. మల్లీశ్వరరావు తొలుత ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్లి, వేరే వారి దగ్గర డబ్బులు తీసుకుని హైదరాబాదు వెళ్తానని మిత్రులతో చెప్పినట్లు సమాచారం. గోదావరి ఎక్సుప్రెస్సులో మల్లీశ్వరరావు హైదరాబాదు వెళ్లాల్సి ఉంది. టికెట్టు డబ్బులు ఉన్నా, ఖర్చులకు డబ్బులు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమికులని తమకు తెలియదని, సన్నిహిత మిత్రులని మాత్రమే అని అనుకుంటన్నట్లు వారి మిత్రులు చెప్పారు. వారిద్దరు కూడా తెలివైన విద్యార్థులని మిత్రులతో పాటు అధ్యాపకులు చెబుతున్నారు. మల్లీశ్వరరావు శవం లభ్యమైతే తప్ప విషయం కొంత మేరకు స్పష్టమయ్యే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications