పోలీస్‌స్టేషన్‌పై మావోయిస్టుల దాడి
నల్గొండ: నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు పోలీస్‌స్టేషన్‌పై బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆ సమయంలో స్టేషన్లో తగినంతమంది పోలీసులు కూడా లేరు. ఆ సమయంలో ఎస్.ఐ. సమీపంలోనే ఉన్న క్వార్టర్లో ఉన్నారు. స్టేషన్‌కు సమీపంలోనే పోలీస్‌క్వార్టర్స్ ఉండటంతో కాల్పుల శబ్దానికి ఎవరూ రాకుండా వాటిపై కూడా ఏకకాలంలో సాయుధులైన నక్సల్స్ పెద్దఎత్తున దాడి చేశారు. కరెంటు తీసేసి ఇరువైపులా మూకుమ్మడిగా చుట్టుముట్టి కాల్పులు జరిపారు.
జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ బదిలీ అయినరోజే ఈ దాడి జరగడాన్ని బట్టి వారు ముందస్తు వ్యూహంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తున్న తరుణంలో వారు తిరిగి తమ సత్తా చూపారు.












Click it and Unblock the Notifications