ఎమ్మార్పీయస్ ఆందోళనలు: ఉద్రిక్తతలు

మరోవైపు ఎల్బీస్టేడియం వద్ద ఇద్దరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఫ్లడ్‌లైట్ల టవర్ ఎక్కారు. వర్గీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే కిందకు దూకుతామని బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణాపై పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ బుధవారం తెలంగాణా జిల్లాల్లో తెరాస, ఇతర పక్షాలు ఆందోళనకు దిగగా పార్లమెంటులో ఎస్సీల వర్గీకరణకు బిల్లు పెట్టాలంటూ రేపటినుంచి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగనుంది. తమ కార్యకర్తలు రేపటినుంచి జాతీయ రహదారుల దిగ్భందం చేపడతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎల్లుండినుంచి రైల్‌రోకోలు చేపడతామన్నారు. తమ డిమాండ్ నెరవేరేవరకు ఆందోళనబాట వీడమని అన్నారు.












Click it and Unblock the Notifications