నందమూరి హీరోల టూర్

Jr Ntr
హైదరాబాద్: జనవరి మొదటివారం నుంచి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌, తారకరత్నలను ప్రచారరంగంలోకి దించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రచారం కోసం నందమూరి హీరోలకు వీలైన తేదీలను మేరకు పర్యటనల షెడ్యూల్‌ రూపొందించాలని అనుకున్నారు. నందమూరి హీరోల ప్రచారపర్వం తీరుపై ఆయా నటులతో మాట్లాడి వారి అభిప్రాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. వారితోపాటు ఇతర నటీనటులను కూడా పూర్తిస్థాయి ప్రచార రంగంలోకి దింపనున్నారు.

మేనిఫెస్టో రూపొందించడం దగ్గరినుంచి ప్రచారపర్వం వరకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిపారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు, నాగం జనార్థన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, కేఈ కృష్ణమూర్తి, గరికపాటి మోహన్‌రావు, టీడీ జనార్దన్‌రెడ్డి, షరీఫ్‌ పాల్గొన్నారు. రాబోయే 100 రోజులు సమరమేనని, అందుకు అనుగుణంగా జనంలోకి వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిని జనంలోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన జనచైతన్య యాత్రలను ఈ నెల 20వ తేదీనుంచి కాక 26న ప్రారంభించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు చంద్రబాబు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలలో ఏదో ఒక జిల్లానుంచి తన పర్యటన ప్రారంభిస్తారు. నెలలో ప్రతి 15 రోజులకు 6 రోజుల పాటు యాత్రలు జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. 'మీకోసం' యాత్రలో భాగంగా పర్యటించిన దాదాపు 160 నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాలు అన్నింటినీ చుట్టిరావాలని నిర్ణయించారు.

ఎన్నికల్లోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించాలంటే రోజుకు కనీసం మూడు స్థానాలకు వెళ్లిరావాల్సి ఉంటుందని అంచనా వేశారు. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఎక్కువ రోజులు రాజధానిలోనే ఉండాలని, ప్రతి 15 రోజులకు 4 రోజులపాటు మాత్రమే జనంలోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+