ఎసిబి సోదాల్లో గ్రేటర్ చేపలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారి ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో విలువైన ఆస్తులు బయటపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖైరతాబాద్ సర్కిల్-10లో టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు.
శ్రీనివాస్ ఇంట్లో16 లక్షల రూపాయల నగదు, 25 తులాల బంగారం, నాలుగున్నర లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉన్న ఓ పాస్‌బుక్, 2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఉంటున్న ఇంటితోపాటు మరో మూడు ఇళ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఇబ్రహీంపట్నంలో 5 ఎకరాలు, గండిపేట సమీపంలో 4 ఎకరాలు, హైదరాబాద్ చుట్టుపక్కల 7 ఇళ్లస్థలాలు ఉన్నట్లు గుర్తించారు.నగరపాలక సంస్థ అసిస్టెంట్ ప్లానర్ శారద ఇంటిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ డిసి గంగాధర్ ఇంటిలోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు.












Click it and Unblock the Notifications