అవినీతి సొమ్ములో కొద్దిగా పెట్టినా..: చిరు

సామాజిక తెలంగాణ సాధనే తన ధ్యేయమని ఆయన చెప్పారు. ప్రజల్లోకి వచ్చిన తర్వాతనే తనలో కొత్త శక్తి, ఉత్సాహం వచ్చాయని ఆయన చెప్పుకున్నారు. ఈ శక్తి ఇస్తున్నవారందరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. నల్గొండ జిల్లాకు ప్రధాన సమస్యలుగా మారిన తాగు, సాగునీటి సమస్యలను తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చిరంజీవి చెప్పారు. రోడ్‌షోలపై న్యాయస్థానం అభ్యంతరం చెప్పడం వల్ల నాలుగువారాలపాటు ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చిందనీ, దీనివల్ల తానెంతో లోటు అనుభవించానని చిరు చెప్పారు. నువ్వు సల్లగుండాలె అని నల్గొండ భూమి తనను దీవిస్తోందని చిరంజీవి చెప్పారు.
ఫ్లోరోసిస్ సమస్య బుష్ సొంత రాష్ట్రంలో కూడా ఉందనీ, అక్కడి ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేశారని చిరు చెప్పారు. ఇలాంటి సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మీరెందుకు ప్రశ్నించరని చిరంజీవి జనాలనుద్దేశించి అన్నారు. వేసినవారికే ఓట్లు వేసి వారి నిర్లక్ష్యాన్ని ఎందుకు భరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తాగు, సాగునీటి సమస్యలను వెంటనే తీరుస్తామనీ, ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకుంటామని చిరంజీవి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications