పార్లమెంటులో 'అంతులే'ని రభస

న్యూఢిల్లీ/ ముంబయి: ఎటిఎస్ చీఫ్ కర్కరే ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయి ఉండకపోవచ్చునని కేంద్ర మైనారిటీ సంక్షేమ మంత్రి ఎఆర్ ఆంతులే చేసిన వ్యాఖ్య గురువారం పార్లమెంటులో దుమారం లేపింది. ఆంతులేను మంత్రివర్గం నుంచి తప్పించాలని బిజెపి, శివసేన సభ్యులు డిమాండ్ చేశారు. బాధ్యతా రహితమైన ప్రకటన ద్వారా ఆంతులే దేశానికి సమస్యను సృష్టించారని బిజెపి సభ్యుడు సంతోష్ గంగ్వార్ అన్నారు. ఆంతులే ప్రకటనపై ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు లోకసభలో డిమాండ్ చేశాయి. ఆంతులే ప్రకటనను పరిశీలించి, తగిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వాయలార్ రవి చెప్పారు.

ముంబయి పేలుళ్లలో మృతి చెందిన పోలీసు అధికారి హేమంత్‌ కర్కరే మృతిపై కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఏఆర్‌ అంతేలే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర అసెంబ్లీలో దుమారం రేపాయి. దీనిపై విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే కర్కరే తీవ్రవాదుల దాడుల్లోనే మృతి చెందారని దీనిపై తిరిగి దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి చవాన్‌ లోకసభలో స్పష్టం చేశారు. ఆంతులేపై బిజెపి రాజ్యసభలో మండిపడింది. బిజెపికి మద్దతుగా జనతాదళ్ -యు, అన్నాడియంకె, ఇతర సభ్యులు నిలిచారు.

ముంబయి పేలుళ్లలో మృతి చెందిన పోలీసు అధికారి హేమంత్‌ కర్కరే మృతిపై కేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఏఆర్‌ అంతేలే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర అసెంబ్లీలో దుమారం రేపాయి. దీనిపై విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే కర్కరే తీవ్రవాదుల దాడుల్లోనే మృతి చెందారని దీనిపై తిరిగి దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి చవాన్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+