కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదలు

కరీంనగర్‌: కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈనెల 15న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ గురువారం ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ మైదానంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ నియోజకవర్గం కింద కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలు వస్తాయి. 4 జిల్లాల్లో 43.09 శాతం పోలింగ్‌ జరిగింది.

మొత్తం ఓట్లు 1,22,882 ఉండగా 48,222 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 50 శాతం మించి వచ్చిన అభ్యర్థే విజయం సాధిస్తారు. కౌంటింగ్‌ దామాషా పద్ధతిలో జరుగుతుంది. ప్రస్తుతం ఓట్లు కట్టలు కడుతున్నారు. ఫలితాలు రాత్రికి వచ్చే అవకాశం ఉంది. విజయంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+