రామోజీ పేరేత్త లేదు: బాబూ మోహన్

నిర్మాతల మండలి గౌరవ ప్రధాన కార్యదర్శి టీవీడీ ప్రసాద్ మాటలపై బాబూ మోహన్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇవాళ నిర్మాతల మండలిలో కూర్చున్న పెద్ద మనుషులకు ఒకప్పుడు పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసి పెట్టానని, కానీ ఈ మధ్య తనకు ఆపద తలెత్తితే వారు ముందుకు రాలేదని ఆయన అన్నారు. ఎప్పుడో తన షూటింగ్‌లో జరిగిన విషయాలను ఎత్తిపొడవాల్సిన అవసరం వారికి లేదని, తాను మంత్రిగా ఉన్నప్పుడు వీళ్లందరికీ ఎంత సాయపడ్డానో తనకు తెలుసుని, తన సినిమా బాగాలేదని అంటున్నారని ఆయన అన్నారు. త్వరలో విశ్వవిద్యాలయాల్లోనూ, సినీ విమర్శకుల కోసం ప్రదర్శిస్తామని, ఫలానా చోట తప్పుందని వారెవరైనా అంటే గుంజీలు తీస్తానని అని చెప్పారు. చిన్న నిర్మాతల సమస్యలపై పరిశ్రమ పెద్దలు ఆలోచించాల్సి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications