ఎలా అపర భగీరథుడు: వైయస్ పై చిరు

Chiranjeevi
నల్లగొండ: మీ గుండెల్లో నన్ను శాశ్వత ఖైదీని చేశారు అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజలనుద్దేశించి అన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో ఆయన శుక్రవారం ప్రజా అంకిత సభలో ప్రసంగించారు. ప్రజలు తనను 30 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకుని పెంచి పోషించారని, వారికి సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావడం భగవంతుడు తనకిచ్చిన అదృష్టమని, భగవంతుడు ప్రజల రూపంలో వచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు మహిళా శక్తి, యుశక్తిపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు.

నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు ఇవ్వలేనివారు అపర భగీరథుడని ఎలా అనిపించుకుంటారని ఆయన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. నల్లగొండ జిల్లా గుక్కెడు నీళ్ల కోసం విలవిలలాడుతోందని ఆయన అన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల ప్రజలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆయన అన్నారు. తాను ప్రజాసమస్యలను పరిష్కరిస్తుందని, సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రజారాజ్యం వల్లనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. యువశక్తిని ప్రభుత్వాలు ఉపయోగించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు మీకు నీటి దాహమైతే నాకు అభిమాన దాహం ఉందని, మీ అభిమానంతో సౌకర్యవంతంగా ఉండేవాడినని, అయితే మీరు నన్ను ఆహ్వానించారని, ప్రజా సేవకు మీరు నాకు అవకాశం ఇచ్చారు. చిరంజీవి మా కోసం చేశాడని మీరు గుండెల్లో దాచుకోవాలని నా కోరిక అని ఆయన అన్నారు. తన జీవితాంతం ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు.

కేంద్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వమే, రాష్ట్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వమే ఉందని, అటువంటప్పుడు రోడ్లు వేయించడానికి ఇబ్బందేమిటని ఆయన అడిగారు. హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ఆఖరు ఏడాది అని, అందుకే వారు ప్రజల వద్దకు వస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+