చిరంజీవి పార్టీలో ఇష్టారాజ్యం

విజయనగరం జిల్లాలోనూ విభేదాలు భగ్గుమన్నాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం ఈ విభేదాలకు ఆజ్యం పోసింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఒక వర్గం దూరంగా ఉంది. రాజకీయానుభవం లేని వారిని కమిటీల్లో వేశారని ఒక వర్గం విమర్శిస్తోంది. విశాఖపట్నంలో కూడా ఒక వర్గం ఆందోళనకు దిగింది. ఎస్సీలకు జిల్లా కమిటీలో ప్రాధాన్యం లేదని ఆ వర్గం విమర్శిస్తున్నారు. వరంగల్ లో జిల్లా కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో విభేదాలు భగ్గుమన్నాయి. కార్యకర్తలు రెండుగా విడిపోయి కొట్టుకున్నారు.












Click it and Unblock the Notifications