కాంగ్రెసుకు బుద్ధి చెప్పారు: కెసిఆర్

కరీంనగర్ శాసనమండలి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి నారదాసు లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. తన సమీప బిజెపి ప్రత్యర్థిని తెరాస అభ్యర్థి 11,294 ఓట్ల మెజారిటీతో ఓడించారు. కాంగ్రెసు పరోక్ష మద్దతు పొందిన అభ్యర్థి ఆకారపు భాస్కర్ రెడ్డి మూడో స్థానంలో నిలువగా, తెలుగుదేశం పరోక్ష మద్దతు పొందిన సి. కుమలకుమారి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో తెరాస శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి. పార్టీకి నైతిక బలం చేకూరింది.












Click it and Unblock the Notifications