పెట్రోల బంకుపై దాడి, కాల్పులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ సమీపంలోని జందాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఓ పెట్రోలుబంక్‌పై ఆగంతకులు తుపాకులతో దాడిచేసి కాల్పులు జరిపారు. వాచ్‌మెన్‌ను, సిబ్బందిని నగదుకోసం డిమాండ్ చేస్తూ 5 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో మహేష్ అనే ఉద్యోగికి తూటా తొడనుంచి దూసుకుని వెళ్లింది. అనంతరం 25 వేలరూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. ఉద్యోగి మహేష్ ను తొలుత ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహేష్ ను అనంతరం హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు.












Click it and Unblock the Notifications