సోనియాతో భేటీ: ఎంపిల వాగ్వాదం

Sonia Gandhi
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో రాష్ట్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శుక్రవారం ఉదయం వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అంశంపై చర్చ సందర్భంగా ఈ పార్లమెంటు సభ్యుల మధ్య ఈ వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ తీర్మానం శుక్రవారం పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సోనియా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణకు చెందిన వి. హనుమంతరావు, మధయాష్కీ గౌడ్ కోరినట్లు తెలుస్తోంది.

తెలంగాణ పార్లమెంటు సభ్యుల వినతిపై తెలంగాణేతర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పార్లమెంటు సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రెడ్డి వర్గీయులు తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల్లో ఉన్న విభేదాలు బయట పడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+