ఎమ్మెల్సీ విజయం స్ఫూర్తి: తెరాస

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించి తెలంగాణా విద్యావంతులు ముక్కోటి ప్రజల ఆకాంక్షలను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రామారావు అన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో తెలంగాణా ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఈనెల 29న హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో జరిగే విద్యార్థి గర్జన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ బహిరంగసభలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించటంతోపాటు ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించే విద్యా విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని రామారావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+