టీవీ యాంకర్ కు సైకో మొగడి బాధ
హైదరాబాద్: మరో టీవీ యాంకర్ భర్త వేధింపుల బారిన పడింది. ఈ మేరకు ఆ టీవీ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుల్లితెర నటి, టీవీ యాంకర్ క్రాంతిమయి తన భర్త శశిధర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శశిధర్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అబద్ధాలతో నమ్మించి తనను పెళ్లి చేసుకున్నాడని, అతను సైకో అని పెళ్లి తర్వాత తెలిసిందని, తనను ప్రతిరోజూ విపరీతంగా కొట్టేవాడని, ఇతర అమ్మాయిలతో అతనికి సంబంధం ఉందని క్రాంతిమయి ఆరోపిస్తోంది.
బెంగుళూరులోని ఒక యానిమేషన్ స్టూడియోలో 30 వేల రూపాయల ఉద్యోగం చేస్తున్నట్లు, త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు పెళ్లికి ముందు చెప్పాడని, కానీ అతనికి ఉద్యోగం లేదని తర్వాత తెలిసిందని ఆమె చెబుతోంది. తాగుడు, గుట్కా వంటి వ్యసనాలన్నీ ఉన్నాయని, అతనికి లేని వ్యసమంటూ లేదని ఆమె ఆరోపిస్తోంది. వీటన్నింటికీ తోడు అతను తనను విపరీతంగా కొట్టేవాడని, తనకు గృహనిర్బంధం విధించాడని ఆమె ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications