వర్గీకరణపై సిఎం హామీ: 22న బంద్

ఇదిలా వుంటే, ఈ నెల 22వ తేదీన రాష్ట్ర బంద్ కు ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఇప్పటికే మందకృష్ణ మాదిగ నిరాహార దీక్షకు మద్దతుగా ఎమ్మార్పీయస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. కాగా, శుక్రవారం జరిగిన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు భేటీలో తాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని సోనియాకు చెప్పానని, వర్గీకరణకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందించారని పార్లమెంటు సభ్యుడు నంది ఎల్లయ్య చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ నిరాహారదీక్షకు దిగారు.












Click it and Unblock the Notifications