హైదరాబాద్: మత్స్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యనారాయణ 125 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించడానికి సహకరించిన మంత్రులు రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రజాధనానికి కస్టోడియన్ గా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత రెడ్డి నిందితుడికి సహకరించడం దారుణమని ఆయన నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఒక శాఖ ఈఈ ఇంత భారీ అవినీతికి పాల్పడితే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక మిగితా శాఖల్లో ఎన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయో ఆలోచించుకోవచ్చని ఆయన అన్నారు.