Credit Card: జాబ్ లేకపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చే సీక్రెట్ టిప్స్!

క్రెడిట్ కార్డు కావాలా? అయితే నెలవారీ జీతం స్లిప్ (శాలరీ స్లిప్) ఉండాల్సిందేనని చాలా మంది గట్టిగా నమ్ముతుంటారు. స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగం లేని వారు, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారు అసలు బ్యాంకుకు వెళ్లి క్రెడిట్ కార్డు కోసం అడగడానికి కూడా వెనుకాడుతుంటారు. కానీ, ఇది కేవలం ఒక అపోహ మాత్రమే! వాస్తవానికి క్రెడిట్ కార్డు పొందడానికి శాలరీ స్లిప్ ఒక్కటే నిబంధన కాదు. బ్యాంకులు ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఇచ్చే ముందు వారికి 'తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని' (Repayment Capacity) మాత్రమే ప్రధానంగా పరిశీలిస్తాయి తప్ప, కేవలం ఆ ముక్క కాగితం చూసి కార్డులు ఇవ్వవు. ప్రస్తుతం శాలరీ స్లిప్ లేకపోయినా మీ ఆదాయాన్ని నిరూపించుకోవడానికి మార్కెట్లో అనేక సులువైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

స్వయం ఉపాధి పొందుతున్నవారు (Self-employed), ఫ్రీలాన్సర్లు, సొంతంగా చిన్న వ్యాపారాలు లేదా కన్సల్టెన్సీలు నడిపేవారు తమ వార్షిక ఆదాయ పన్ను రిటర్నులు (ITR) లేదా బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లను ఆదాయ రుజువుగా చూపించవచ్చు. మీ ఖాతాలోకి క్రమం తప్పకుండా సాగుతున్న నగదు లావాదేవీలు, తగినంత బ్యాంకు నిల్వల (Average Monthly Balance) ఆధారంగా బ్యాంకులు చాలా సులభంగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. ప్రతి బ్యాంకుకు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది.

How to Apply for a Credit Card Without Salary Slip Smart Strategies for Freelancers and Self-Employed

FD ఉంటే చాలు.. నిమిషాల్లో కార్డు మీ చేతికి!

ఒకవేళ మీ వద్ద ఎలాంటి ఇన్ కమ్ ఫ్రూఫ్ లేనప్పుడు, క్రెడిట్ కార్డు పొందడానికి అన్నింటికంటే సులువైన మార్గం 'ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డు'. బ్యాంకింగ్ పరిభాషలో దీనిని 'సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్' (Secured Credit Card) అంటారు. బ్యాంకులో మనం చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని పూచీకత్తుగా (సెక్యూరిటీగా) ఉంచుకుని బ్యాంకులు ఈ కార్డులను జారీ చేస్తాయి. సాధారణంగా మీ డిపాజిట్ మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు క్రెడిట్ పరిమితి (లిమిట్) లభిస్తుంది. విద్యార్థులకు, హౌస్‌వైఫ్స్‌కు, అలాగే తొలిసారిగా క్రెడిట్ మార్కెట్లోకి అడుగుపెట్టేవారికి ఈ విధానం అత్యంత అనుకూలంగా ఉంటుంది.

Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్
Kisan Credit Card కొత్త రూల్స్.. రైతన్నలకు ఆర్బీఐ గుడ్ న్యూస్

పాత బ్యాంక్ ఖాతా ఉందా? అయితే 'ప్రీ-అప్రూవ్డ్' ఆఫర్ ఖాయం!

మీరు ఎంచుకున్న బ్యాంకులో ముందే ఏదైనా పొదుపు ఖాతా (Savings Account) ఉండి, దాని ద్వారా చాలా కాలంగా లావాదేవీలు చేస్తున్నట్లయితే క్రెడిట్ కార్డు రావడం మరింత సులభమవుతుంది. మీ ఖాతాలోని సగటు నిల్వలు, మీ క్రమబద్ధమైన ఆర్థిక అలవాట్లను గమనించే బ్యాంకులు.. ఎలాంటి డాక్యుమెంట్లు అడగకుండానే ఆటోమేటిక్‌గా ముందే ఆమోదించిన (Pre-approved) క్రెడిట్ కార్డు ఆఫర్లను మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లోనే చూపిస్తుంటాయి. అందుకే మీ పాత బ్యాంకుతో సత్సంబంధాలు మరియు మంచి లావాదేవీల చరిత్ర కలిగి ఉండడం ఎప్పుడూ లాభదాయకంగా మారుతుంది.

దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

క్రెడిట్ కార్డు పొందే ప్రయత్నంలో ఒక బ్యాంకులో మీ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, తక్షణమే కంగారుపడి మరికొన్ని బ్యాంకుల్లో వరుసగా అప్లై చేయడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఇలా వేర్వేరు బ్యాంకులు ఒకేసారి మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేయడం (Hard Inquiry) వల్ల మీ క్రెడిట్ స్కోరు ఘోరంగా దెబ్బతింటుంది. అసలు మీ దరఖాస్తు ఎందుకు రిజెక్ట్ అయిందో కస్టమర్ కేర్ ద్వారా తెలుసుకుని, ఆ లోపాన్ని సరిదిద్దుకున్న తర్వాత (కనీసం 3 నెలల గ్యాప్ ఇచ్చి) తదుపరి ప్రయత్నం ప్రారంభించడం ఉత్తమం.

UPI Credit Lines: అప్పులపై ఆర్‌బీఐ కొరడా.. కొత్త రూల్స్ ఇవే!
UPI Credit Lines: అప్పులపై ఆర్‌బీఐ కొరడా.. కొత్త రూల్స్ ఇవే!

అలాగే, బ్యాంకింగ్ రంగంలోకి కొత్తగా ప్రవేశించినప్పుడు మొదట్లోనే ప్రీమియం లేదా అధిక వార్షిక రుసుము (Annual Fee) ఉండే కార్డుల కోసం ప్రయత్నించకుండా, ఎంట్రీ లెవెల్ లేదా లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులను ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచి పద్ధతి. వీటిని వాడుతూ, ప్రతి నెలా సకాలంలో బిల్లులు చెల్లిస్తూ మంచి సిబిల్ (CIBIL) స్కోరును నిర్మించుకుంటే, భవిష్యత్తులో బ్యాంకులే స్వయంగా మీ కార్డును ప్రీమియం స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తాయి. కాబట్టి, శాలరీ స్లిప్ లేకున్నా సరైన వ్యూహంతో ముందుకు సాగితే ఈజీగా క్రెడిట్ కార్డును సాధించవచ్చు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+