అసమ్మతి ఎమ్మెల్యేలంతా కాంగ్రేస్ లోకి
హైదరాబాద్: వై.ఎస్, డీఎస్‌లతో కుదిరిన అవగాహనమేరకు తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి ఎమ్మెల్యేలంతా ఆదివారంనాటికి రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. అధికారపక్షానికి మద్దతు ఇచ్చిన ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ సంసిద్ధత వ్యక్తం చేయగా 5గురు అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరంతా ఈనెల 26న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు తమ తమ నియోజకవర్గాల్లో తమ అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. మరో 15 రోజుల్లో అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications