ఎసీబీ కి చిక్కిన ఏసిపీ
హైదరాబాద్: సరూర్‌నగర్ సబ్ డివిజన్ ఏసీపీ లక్ష్మీకాంత్ షిండేను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మేరకు నమోదైన కేసులో నిందితుడ్ని తప్పించేందుకు ఆయన ప్రయత్నించగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. ఇక లంచం తీసుకుంటున్న ఆయన నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకుని, ఇంట్లో సోదాలు ప్రారంభించారు.
సరూర్‌నగర్ వాస్తవ్యుడైన సయ్యద్ మసియుద్దీన్‌పై మూడు నెలల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. తనను ఎలాగైనా కేసు నుంచి తప్పించాలని మసియుద్దీన్ ఏసీపీ షిండేను అభ్యర్థించాడు. అందుకు ఏసీపీ రూ.2 లక్షలు వరకూ డిమాండ్ చేశాడు.తొలి విడతగా రూ.50 వేలు శుక్రవారం ఇవ్వాలని చెప్పాడు. చాదర్‌ఘాట్ వద్ద మసియుద్దీన్ నుంచి ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గోషామహల్ పోలీస్ క్వార్టర్స్‌లోని ఏసీపీ నివాసానికి చేరుకుని అక్కడా సోదాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications