'బిగ్ ఫిష్'కు బెయిల్ నిరాకరణ

ఎన్నికల ముందు ఇంత పెద్ద కుంభకోణం బయటపడడం, సూర్య నారాయణకు మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు సహకరించారని ఆరోపణలు రావడంతో వైఎస్ ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రతిపక్షాలకు ఇది పెద్ద అస్త్రంగా మారింది. సూర్యనారాయణ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం, సిబీఐ దృష్టికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ బయటికి వస్తే మంత్రులు, అధికారుల పేర్లు బయటికి వస్తాయన్న భయం వైఎస్ సర్కారుకు పట్టుకుంది. అందువల్ల కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications