సిఎస్ రమాకాంత్ రెడ్డికి అస్వస్ధత
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఆస్పత్రిలో చేరారు. మత్స్యశాఖ ఇంజినీర్ సూర్యనారాయణకు గత ఆరేడు ఏళ్ళుగా రమాకాంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కస్టోడియన్ గా ఉండాల్సిన సీనియర్ మోస్ట్ ఐఎఎస్ అధికారి అవినీతి కూపంలో కూరుకుపోయారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో తీవ్ర వత్తిడికి గురైన రమాకాంత్ రెడ్డి అస్వస్ధులయ్యారు.
"సూర్యనారాయణకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రమాకాంత్ రెడ్డిపై ప్రభుత్వం అనివార్య పరిస్ధితుల్లో చర్య తీసుకోవలసి ఉంటే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది, లేదంటే దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళాలి" అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications