మెదక్: ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన మెదక్ జిల్లా నేడు ఎడారిగా మారిందని, నారాయణ్‌ఖేడ్ లో ఎక్కడా పచ్చదనం కానరావడం లేదని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అంకిత సభల్లో భాగంగా ఆయన ఈ రోజు మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో ప్రసంగించారు. అక్కడ అభిమానుల నుంచి వచ్చిన స్పందనకు ఆయన పులకించిపోయారు. పక్కనే మంజీరా నది ప్రవహిస్తున్నా గొంతు తడిసే భాగ్యానికి ఈ ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆయన వాపోయారు.