తూగో జిల్లా: సెజ్ లపై తీవ్ర ఆగ్రహం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి, కొత్తపల్లి మండలాల్లో సెజ్‌ల (ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ) ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి స్థానికులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ మండలాల్లో భూముల స్వాధీనానికి సర్వసన్నద్ధం అయింది. ఈ మండలాల్లో 800 మంది పోలీసులను మొహరించారు.
గత రాత్రినుంచే పోలీసులను మొహరించటంతో స్థానికులు కూడా ప్రాణాలు పోయినా సెజ్‌లను అడ్డుకుంటామంటున్నారు. ఈరోజు తొండంగి మండలం శ్రీరాంపూర్‌లో పర్యవేక్షణ నిమిత్తం వస్తున్న డిఎస్పీ జీపును స్థానికులు అడ్డుకున్నారు. వాకదారిపేటలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు తమ పని ఆపటం లేదు. పెరుమాళ్లపురంలో కంచె వేసే ప్రయత్నాలను ఈరోజు పోలీసులు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications