రమాకాంత్ తల్లి గుండెపోటుతో మృతి

హైదరాబాద్‌: అవినీతి అధికారి సూర్యనారాయణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి తల్లి ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆ వెంటనే రమాకాంత్‌కూడా అస్వస్థతకు గురికావటంతో ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేశారు.

రమాకాంత్ రెడ్డి ఒక ప్రముఖ దినపత్రిక నుంచి తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తొలగించి ఎస్ వి ప్రసాద్ ను నియమిస్తారని ఆ పత్రిక నేడు ప్రత్యేక కథనం ప్రచురించడంతో రెడ్డి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అవినీతి ఆరోపణలే కాకుండా రమాకాంత్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంలో రమాకాంత్ రెడ్డిపై ఈ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆగ్రహించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి రెడ్డిని ఢిల్లీకి పిలిపించి, లిఖితపూర్వక క్షమాపణ లేఖను తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+