నిజమైన జీహాద్ కి తరుణం
ఇస్లామాబాద్: యుద్ధం వస్తే పాక్‌కు మద్దతిస్తాం తాలిబన్ల బహిరంగ ప్రకటన చేసారు. భారత్ పాకిస్థాన్‌పై దాడులకు దిగిన పక్షంలో తాము పాకిస్థాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని తాలిబన్లు ప్రకటించారు.పాకిస్థాన్‌పై ఎవరైనా దాడులు చేస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని వారు హెచ్చరించారు. తెహ్రిక్-ఇ-తాలిబన్ అధ్యక్షుడు బైతుల్లా మసూద్ ఈరోజు ఇస్లామాబాద్‌కు చెందిన ఓ దినపత్రిక విలేకరితో ఫోన్‌లో మాట్లాడారు. శిక్షణ పొందిన వందలాది మంది తాలిబన్లు ఆత్మాహుతిదాడులకు సిద్ధంగా ఉన్నారనీ, వారు పాకిస్థాన్ సైన్యానికి మద్దతుగా నిలుస్తారని మసూద్ చెప్పారు. అణు సంపత్తి కలిగిన ఇస్లామిక్ రాజ్యాన్ని అణగదొక్కాలని కొన్ని శక్తులు చూస్తున్నాయనీ, ముజాహిదీన్లు దాన్ని చూస్తూ వూరుకోరని మసూద్ అన్నారు. నిజమైన జిహాద్‌కు తరుణం ఆసన్నమైందని చెప్పారు.












Click it and Unblock the Notifications