మహేష్ బాబు ప్రచారానికి రాడు
గుంటూరు: నటుడు మహేష్‌బాబు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలలోకి వస్తారనే కథనాలు నిజం కాదని, అసలు ఆ విషయంపై ఇప్పటి వరకు ఆలోచించిందే లేదని సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చెప్పారు. గుంటూరు జిల్లాలోని స్వగ్రామం బుర్రిపాలెం వచ్చిన ఆయన మాట్లాడారు. మహేష్‌బాబు ప్రచారంలోకి వస్తారనేది నిజం కాదన్నారు.
ప్రభుత్వం నుంచి కూడా అలాంటి ప్రతిపాదనేం లేదని, ఒకవేళ వస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. సోదరుడు కృష్ణ కూడా ప్రభుత్వం కోరటంతోనే ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారని చెప్పారు. మహేష్‌బాబు సినీరంగంలో మంచిస్థాయిలో ఉన్న సమయంలో రోడ్లపై తిరగటం ఆయన భవిష్యత్తుకు మంచిది కాదనేది తన అభిప్రాయమన్నారు.












Click it and Unblock the Notifications