పాక్ లో సినిమా వ్యాపారానికి ముప్పు
కరాచి: ముంబైపై ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌లో సినిమా వ్యాపారం దె బ్బతిన్నదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. బాలీవుడ్ సినిమాలకు పాక్‌లో మంచి ఆదరణ ఉంది. అవే వారి వ్యాపారానికి ఆధారం కూడా. సుమారు 42 ఏళ్ల తర్వాత భారతీయ సినిమా ప్రదర్శనలపై నిషేధాన్ని పాక్ ప్రభుత్వం గత ఏడాదే ఎత్తివేసింది.
రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియ లో ఇదో కీలక మైలురాయి. ఈ ని ర్ణయం వల్ల ఎక్కువగా ప్రయోజ నం పొందింది పాక్‌లోని సినీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే. ముంబై దా డుల అనంతరం ద్వైపాక్షిక శాంతి ప్రక్రియకు విఘాతం కలగడంతో వారిప్పుడు లబోదిబోమంటున్నా రు. బాలీవుడ్ కొత్త సినిమాలేవీ పాక్‌లో విడుదల కాలేదు.












Click it and Unblock the Notifications