జమ్ము:సీఎం అభ్యర్థి తన కుమారుడు ఒబర్ అబ్దుల్లానేనని కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈరోజు ప్రకటించారు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఫరూక్ అబ్దుల్లాసీఎం అభ్యర్థి తానేనని ప్రకటించారు. ఒక్కరోజులోనే ఆయన మాటమార్చి తన కుమారుడి పేరు ప్రకటించారు. అయితే సంకీర్ణ సర్కారు ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మాత్రం ఇంకా ఏ పార్టీతో జట్టుకట్టాలో నిర్ణయించుకోలేదు. ఈ మేరకు సోనియా పిడిపి, ఎన్‌సి నేతలతో ఈ రోజు సమావేశం కానున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్, ఎన్‌సికి మద్దతు ఇవ్వడం, ఒమర్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమేనన్నది సీనియర్ నాయకులు అంటున్నారు . అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒమర్ సిఎం పదవి చేపట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.