హైదరాబాద్: పీఆర్పీ అధినేత చిరంజీవి, తన బావమరిది అల్లు అరవింద్‌తో కలసి ఎన్టీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్ తో గురువారం సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పొత్తు నిర్ణయాన్ని ఎన్నికల సమయంలో ప్రకటించాలనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయంపై మరింతగా చర్చించడానికి ఈ రోజు (శుక్రవారం) మరోసారి సమావేశం అవుతున్నారు.