డైలాగు మార్చిన అమెరికా
వాషింగ్టన్: భారత్ కోరిన తీవ్రవాదులను అప్పగించాల్సిన అవసరం లేదనీ, వారిని పాక్‌లోనే శిక్షించవచ్చనీ ఒబామా ప్రభుత్వం పాకిస్థాన్‌కు సూచించినట్లు పాక్ మీడియా చెబుతోంది. నిన్నటి వరకూ ముంబై పేలుళ్లకు రూపకల్పన చేసిన తీవ్రవాదులను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఆ ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న కామెంట్స్ చూస్తూంటే అమెరికా వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై పేలుళ్ల రూపకర్తలను విచారించేందుకు బలమైన సాక్ష్యాధారాలతో సిద్ధమై, వారిని శిక్షించాలని అమెరికా పాకిస్థాన్‌కు సూచించినట్లు డాన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తమ దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందమేదీ లేనందున భారత్ కోరిన లష్కరే తీవ్రవాదులను అప్పగిస్తే సమస్యలు వస్తాయని పాక్ అమెరికాకు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications