ముస్లింగా షబ్బీర్ జల్సా:ఖలీల్‌బాషా

అంతేగాక షబ్బీర్ పేరున సారా అంగడి ఉందని తెలిపారు. ఆయన ఇంటిపై దాడిచేస్తే అక్రమంగా దాచిన టేకు దొరికిందని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలోకి వీధి రౌడీలా ప్రవేశించినందుకు నెలపాటు ఆయనను జైలుకు పంపారని వెల్లడించారు. షబ్బీర్ చేసేవన్నీ ఇస్లాంకి వ్యతిరేకమైనవేనని చెప్పారు. జామియా నిజామియా అనే సంస్థ ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేసిందని తెలిపారు. గతంలో లోక్‌సత్తా తయారుచేసిన చరిత్రహీనుల జాబితాలో షబ్బీర్ పేరుందని వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం చరిత్రహీనుల పేరుతో లోక్‌సత్తా విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు కూడా ఉందన్నారు. ఐదేళ్ల క్రితం పూట గడవని మంత్రి షబ్బీర్ నేడు వందల కోట్లు సంపాదించాడని వారు ఆరోపించారు. వక్ఫ్ భూములను ఎంపీ లగడపాటికి కట్టబెట్టి షబ్బీర్ లబ్ది పొందారని ఆరోపించారు. అలాంటి షబ్బీర్‌కు యువరాజ్యం అధినేత పవన్ గురించి మాట్లాడే నౌతిక హక్కులేదన్నారు. రామచంద్రయ్య మాట్లాడుతూ వైజాగ్, విజయవాడల్లో షబ్బీర్ ప్రమేయంతో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల వివరాలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications