బాలకృష్ణ పర్యటన 20 తర్వాతే

Balakrishna
హైదరాబాద్‌: ఉత్తరాంధ్రలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు నందమూరి బాలకృష్ణ తన రాజకీయ పర్యటనలకు శ్రీకాకుళం జిల్లాతో శ్రీకారం చుట్టనున్నారు. కళా వెంకట్రావు రాజీనామాతో ఏర్పడ్డ లోటును భర్తీ చేసేందుకు వ్యూహాత్మకంగా ఈ జిల్లాను ఎంచుకున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత బాలకృష్ణ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

పీఆర్పీ అధినేత చిరంజీవి గతంలో శ్రీకాకుళం జిల్లా నుంచే పర్యటనను ప్రారంభించిన నేపథ్యంలో.. బాలయ్య కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. అది కూడా ఎన్టీఆర్‌ విగ్రహాల ఆవిష్కరణలు చేపట్టడం కాకుండా నేరుగా ప్రచారానికే దిగాలన్నది పార్టీ నేతల అభిప్రాయం. ఈ నెల 17న కూడా చిరంజీవి ఆ జిల్లాకు వెళ్ళనున్నారు. టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లిన వారిలో శ్రీకాకుళం జిల్లా వారే ఎక్కువ. నాయకులు వెళ్ళినా కార్యకర్తలు పెద్దగా చెదరకుండా చూడటం, పార్టీని వీడిన మాజీలను సొంతగూటికి ఆహ్వానించడమే వ్యూహంలో భాగంగా బాలకృష్ణ ఇమేజ్‌ను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు.

ఇందులో భాగంగా నే ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న పలువురు నేతలకు టీడీపీ గాలం వేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు రేవతీపతి, కృష్ణారావులను పార్టీలోకి రప్పించడంతోపాటు..పీఆర్పీలో ఉన్న గొర్లె హరిబాబునాయుడునూ ఆహ్వానించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పీఆర్పీలో చేరిన టీడీపీ నేతలంతా తననే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడంతో.. జిల్లాలో పార్టీ పట్టు సడలకుండా చూసుకోవడం ఎర్రన్నాయుడుకూ పరీక్షగా మారింది.

ఇప్పటికే కొంతమంది నేతలతో టీడీపీ నాయకులు చర్చించినట్టుగా తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో ఆదినుంచీ ఎన్టీఆర్‌ కుటుంబానికి ఉన్న ఆదరణ పార్టీని నిలబెడుతుందని, బాలకృష్ణ పర్యటనతో ఇది రుజువవుతుందని ఓ నేత ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు సమ్మేళనాలకు అగ్ర నేతలు11 ఈ నెల 8న నెల్లూరులో జరగనున్న టీడీపీ, లెఫ్ట్‌ల రాజకీయ సమ్మేళనానికి టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీల అగ్ర నేతలు చంద్రబాబు, బీవీ రాఘవులు, నారాయణ హాజరవుతుండగా, 9న చిత్తూరులో జరగనున్న సమ్మేళనానికి రాఘవులుకు బదులు నోముల నరసింహయ్య పాల్గొంటారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+