హైదరాబాద్ :వందరోజుల్లో తెలంగాణ పేరుతో సోమవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద సత్యాగ్రహం నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల్లో అదే తమ ఎజెండా కానుందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.ఇక తమ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఫిబ్రవరి 4న విజయవాడలో విజయ సంకల్ప యాత్రకు రానున్నారని ఆయన చెప్పారు. అదేనెల రెండో వారంలో కరీంనగర్‌లో విజయ సంకల్ప యాత్రకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ రానున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిపిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మణ్, అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావులతో కలిసి దత్తాత్రేయ మాట్లాడారు.ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు.