హైదరాబాద్ : బాలకృష్ణ దంపతులుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం ఒక స్టార్ హోటల్లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందులో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిపాటి రాజకీయ చర్చ, బాలయ్య కొత్త సినిమా చిత్రీకరణ ప్రణాళిక, పార్టీ ప్రచారం తదితర అంశాలూ చర్చకు వచ్చాయి. ఈ నెల నాలుగో వారం నుంచి ప్రచారంలో పాల్గొంటానని బాలయ్య చెప్పారు. అలాగే ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా చిత్రీకరణ మార్చి చివరి వరకు ఉంటుందన్నారు.