చిత్తూరు: మతి భ్రమించిన ప్రజారాజ్యం పార్టీ నాయకులును ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపితే బాగుంటుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ఆమె ఆదివారం సందర్శించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫీఆర్పీ పార్టీని తీవ్రంగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 240 సీట్లు గెలుస్తామని చిరంజీవి,294 సీట్లు గెలుస్తామని అల్లు అరవింద్,220 సీట్లు గెలుస్తామని పవన్ కళ్యాణ్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇది వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. పీ ఆర్పీ మాటలు వింటూంటే చంద్రబాబు,వైయస్ సైతం గెలిచేలా లేరని ఎద్దేవా చేసారు. ఎక్కడి నుంచైనా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన చిరంజీవి తిరుపతికి పరెగెత్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.