పచ్చచొక్కాలు పందికొక్కుల్లా..వైయస్

ఆయన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర వచ్చారు. రాజమండ్రి నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ను ట్రాక్టర్‌లో రేణుక తానే స్వయంగా నడుపుతూ ర్యాలీగా తీసుకెళ్లారు. రూ.100 కోట్ల విలువైన మూడు రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రూ.50 కోట్లతో వైరా రిజర్వాయర్ ఆధునికీకరణ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మధిరలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలతో సహా చెప్పని వాటిని అమలు చేస్తున్నామన్నారు.
ఎంత ఖర్చయినా వెనుకాడకుండా రైతు సేద్యానికి అవసరమైన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఉద్ఘాటించారు. తెదేపా హయాంలో సాగుకు నీరులేదని, పంటలకు గిట్టుబాటు ధరలేదని, తన పాలనాకాలంలో ఏడేళ్లపాటు కరవు కాటకాలు ఎదురైనా పేదలను ఆదుకుందామన్న కనీస ఇంగితజ్ఞానం చంద్రబాబుకు లేకుండా పోయిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications