జడ్పీ ఫలితాలును పట్టించుకోం :డీఎస్

D Srinivas
హైదరాబాద్ : జెడ్పీటీసీ ఉపఎన్నికల ఓటమి తాము పరిగణలోకి తీసుకోలేదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సమన్వయ కర్త కురియన్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులకు అల్పాహార విందును ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ స్థితి, ప్రభుత్వ పథకాల ప్రభావం, జలయజ్ఞం తదితర అంశాలపై చర్చించారు.

సమావేశానంతరం డీఎస్ మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల ఓటమి విషయం గురించి ఎటువంటి చర్చా జరగలేదని అన్నారు. కేవలం రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, ఇతర ముఖ్య విషయాలపై మాత్రమే తాము కురియన్ తో చర్చలు జరిపినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు కంటే టీఆర్‌ఎస్‌తో పొత్తు పార్టీకి మేలు కలిగిస్తుందని సీనియర్లు కురియన్‌కు వివరించారు. టీడీపీ, వామపక్షాలు, టీఆర్‌ఎస్ కలిస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని చెప్పారు. అయితే సీనియర్ల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలుపుతానని కురియన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటస్వామి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, వి.హనుమంతరావు, కేవీపీ, అజీజ్ నర్సారెడ్డిలతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+