వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రూప్ రేప్ చేసి వీడియో తీసి..

By Staff
|
Google Oneindia TeluguNews

కొత్తగూడెం :ప్రేమించానని చెప్పి బయిటకు తీసుకెళ్ళి ప్రెండ్స్ తో కలిసి గ్రూప్ రేప్ చేసి సెల్ తో వీడియో తీసిన సంఘటన ఒకటి లేటుగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఒక బాలిక (16) లక్ష్మీదేవిపల్లిలోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతుండేది. ఆ సమయంలో ప్రేమ పేరుతో ఒక వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తొందరలోనే ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.

2007 ఫిబ్రవరి 17న బాలికను ఆ యువకుడు కాలేజి వద్ద నుంచి ఆటోలో బయిటకు తీసుకొచ్చాడు. మార్గమధ్యంలో అతని స్నేహితులు కూడా అదే ఆటోలో ఎక్కారు. తన లవర్ ప్రెండ్సే అనుకున్న ఆ అమాయకురాలు వారి మనస్సులో కుట్రను గమనించలేదు. అట్నుంచి అటే రామవరం గరీబ్‌పేట సమీపంలోని అడవిలోకి వెళ్లారు. మొదట ఆ బాలికతో ఆ ప్రేమికుడు శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత బలవంతంగా ఆమెతో మద్యం తాగించాడు. మత్తులో పడిపోయిన ఆమెను అతడి స్నేహితులు సామూహికంగా బలాత్కరించారు.

అనంతరం ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రించారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన సీడీలను రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఒక ఇంటర్నెట్‌ కేంద్రంలో కాపీ చేస్తుండగా విషయం బయటికి పొక్కింది. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ బి.అశోక్‌కుమార్‌, సీడీల ఆధారంగా ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X